- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతులకు సాగు చట్టాల పై అవగాహన అవసరం.. జస్టిస్ పి.నవీన్ రావు
దిశ, పాలకుర్తి : మండలంలోని బొమ్మెర గ్రామంలో ఆదివారం నిర్వహించిన రైతులు సాగు చట్టాలు న్యాయ సహాయం (అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్) అనే అంశం పై నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెంట్ ఫర్ ఫార్మర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బులు లేక న్యాయ సహాయం పొందులేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఉచిత న్యాయ సహాయం కోసం న్యాయ సేవా సంస్థ స్థాపించామని తెలిపారు. మూడు లక్షలలోపు ఆదాయం ఉన్న వారందరూ ఈ సహాయం పొందవచ్చు అని అన్నారు. ఏలాంటి కేసులు ఉన్న ఈ సంస్థ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల సాగు చట్టాల పై అగ్రిలీగల్ ఎయిడ్ క్లినిక్స్ ప్రారంభించామని, తద్వారా రైతులకు ప్రభుత్వం నుండి అందుతున్న సేవలు చట్టాలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అన్నారు. అందుకోసం పారా లీగల్ సిబ్బందిని నియమించామన్నారు. సుమారు 124 రైతు చట్టాలు ఉన్నాయని ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. రైతులు ఎక్కడైనా మోసపోయినట్లు అయితే వెంటనే సంస్థలు సంప్రదించాలని సూచించారు. న్యాయ సేవ సంస్థ ద్వారా వివిధ రకాల సేవలు అందుతున్నాయని వినియోగదారుల ఫోరం కూడా అందుబాటులో ఉంటుందన్నారు.
స్వతహాగా రైతు కుటుంబం నుండి వచ్చిన బొమ్మర పోతన చారిత్రాత్మకమైన బొమ్మెర గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. రైతులకు సంబంధించిన భూ సమస్యలు విత్తన సమస్యలు వ్యాపార సమస్యలు ఏ విషయాల పైన న్యాయ సేవ సంస్థలు సంప్రదించాలని ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు బొమ్మర గ్రామంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్స్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకుని మొక్క నాటారు బొమ్మర పోతన సమాధిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ, నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ శ్రీకృష్ణదేవరాయ, రైతు చుట్టాల డైరెక్టర్ సునీల్, గోవర్ధన్ రెడ్డి, విక్రమ్ తదితరులలు రైతు చట్టాలు అవగాహన తదితర అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్స్ ప్రజా ప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు.