- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేరాల నియంత్రణకే నిర్భంద తనిఖీలు.. సీఐ షేక్ యాసీన్..
దిశ, కొత్తగూడ : నేరాల నియంత్రణకే నిర్భంద తనిఖీలు అని గూడూరు సీఐ షేక్ యాసీన్ అన్నారు. ఆదివారం కొత్తగూడ మండలంలోని రామన్నగూడెం, లాడాయిగడ్డ గ్రామాలల్లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీశరత్ చంద్రపవర్ ఆదేశాల అనుసారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ షేక్ యాసీన్ మాట్లాడుతూ గ్రామాల్లో నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ప్రజలు, యువత గంజాయి, మద్యం, గుట్కావంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
మద్యం తాగి వాహనాలు అతివేగంగా, అజాగ్రత్తగా నడపవద్దన్నారు. వీటితో కలిగే ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు. కార్డెన్ సెర్చ్ లో 800 లీటర్ల గుడుంబా పానకాన్ని ధ్వంసం చేశారు. 25 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు నగేష్, ఉపేందర్, దిలీప్, కేంద్ర బలగలు, పోలీస్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.