బోగత సందర్శనకు అనుమతి..ఎప్పటి నుంచి అంటే..?

by Aamani |
బోగత సందర్శనకు అనుమతి..ఎప్పటి నుంచి అంటే..?
X

దిశ ఏటూరునాగారం: తెలంగాణ నయాగరా పేరు గాంచిన బొగత జలపాతం ములుగు జిల్లా, వాజేడు మండలంలో కలదు. అయితే ఈ జలపాతం సందర్శనకు శనివారం నుంచి అనుమతి ఇచ్చినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉన్నతాధికారుల ఆదేశంపై బొగత జలపాతం పర్యాటకుల సందర్శన ను నిలిపివేశారు. భారీ వర్షాలు, గోదావరి వరదలు తగ్గుముఖం కావటంతో ఉన్నతాధికారుల ఆదేశంపై శనివారం ఉదయం నుండి జలపాతానికి పర్యాటకుల సందర్శన అనుమతిస్తున్నట్లు వాజేడు ఎఫ్ఆర్ఒ తెలిపారు.

Advertisement

Next Story