ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 25 నుంచి ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలు

by Disha Web Desk 23 |
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 25 నుంచి ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలు
X

దిశ, వరంగల్ కలెక్టరేట్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో పదో తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించబతాయి. ఈనెల 25 నుంచి మే రెండో తేదీ వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించబడతాయని హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి డా అబ్దుల్ హై, ఉమ్మడి వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్ మురాల శంకర్ రావు తెలిపారు. ఇప్పటివరకు హాల్ టికెట్స్ అందని విద్యార్ధులు www.telanganaopenschool.org లో తీసుకోగలరని వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో హాజరవ్వాలని సూచించారు. ప్రతి సెంటర్ కి ఒక సీఎస్ ఒక డివో ను, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ ను కేటాయించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాలు/రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని మొబైల్ ఫోన్లు అనుమతించబడవని హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి డా అబ్దుల్ హై, ఉమ్మడి వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్ మురాల శంకర్ రావు సూచించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రెండు సెషన్లలో ప్రతి రోజు ఉదయం 9.00 గ నుండి మధ్యాహ్నం 12.00 గం. వరకు, మధ్యాహ్నం 2.30 గం. నుంచి సాయంత్రం 5.30గం వరకు నిర్వహించబడునని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులకు 2429 మంది విద్యార్థులకు గాను 14 కేంద్రాలు, 3901 ఇంటర్మీడియట్ విద్యార్థులకు గాను 19 పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed