ప్రారంభం కాని వడ్ల కొనుగోలు కేంద్రం..

by Disha Web Desk 23 |
ప్రారంభం కాని వడ్ల కొనుగోలు కేంద్రం..
X

దిశ, శాయంపేట : యాసంగిలో ఓ వైపు సాగునీరు అందక కూడా రైతులు పంటలు పండించడం ఒక ఎత్తయితే...పండించిన పంటకు సరైన మద్దతు ధరతో అమ్ముకోవడం మరోవైపు. కానీ హన్మకొండ జిల్లా, శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామంలో యాసంగి పంట కోతలు ప్రారంభమైన కూడా గ్రామంలో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో అన్న దాతలు అగచాట్లు పడుతున్నారు. రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యంను విక్రయించుకోవడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రం సూర్య నాయక్ తండా లో ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకోవాల్సిన వస్తుందని రైతులు చెబుతున్నారు. సకాలంలో గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే రైతాంగానికి ఎంతో మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు.కల్లలోని వరి ధాన్యం కుప్పలు కుప్పలుగా పడి ఉంది.అయినా కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు ఆశ్రయించి అడ్డికి పావు సేరుకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఒడీసీఎంఏస్ ద్వారా కొనుగోలు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సూర్య నాయక్ తండా సెంటర్ కు ఒడీసీఎంఎస్ ద్వారా వడ్ల కొనుగోలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సూర్య నాయక్ తండా సెంటర్ నిర్వాహకుడు బీఆర్ ఎస్ కార్యకర్త అని అతని సెంటర్ నీ క్యాన్సిల్ చేపించి కాంగ్రెస్ కార్యకర్తకు సూర్య నాయక్ తండా సెంటర్ ఇచ్చినట్టు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సూర్య నాయక్ తండాకు నిర్వహించిన సెంటర్ నిర్వాహకుడు సెంటర్ ఎందుకు నాకు క్యాన్సిల్ చేశారో అర్థం కాలేదని, కనీసం అధికారులు కూడా నాకు సమాచారం చెప్పలేదని సెంటర్ నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.ఇకనైనా రాజకీయాలు పక్కనపెట్టి కల్లాలలో ఉన్న వరి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ విషయమై ‘దిశ’ విలేకరి మండల అధికారులకు సంప్రదించగా మాకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Next Story

Most Viewed