- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రససిద్ధాంతాల ఆధారంగా నాట్య వేదం

దిశ, హనుమకొండ : రస సిద్ధాంతాల ఆధారంగా భరతముని నాట్య వేదం రచించాడని సంస్కార భారతి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డా. బందెల మోహనరావు అన్నారు. ఈనెల 13న వరంగలోని ది టెంపుల్ డాన్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ లో నిర్వహించిన సంస్కార భరతముని స్మరణ దివాస్ కార్యక్రమంలో సంస్కార భారతి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డా. బందెల మోహనరావు ముఖ్య అతిథిగా పాల్గొని భరతముని గురించి ప్రసంగించారు. భరతముని మన నాలుగు వేదాల నుండి శృతి, లయలు, భావ తాళాలు, రాగ గతులు, రస సిద్ధాంతాల ఆధారంగా నాట్య వేదంను రచించాడు అని తెలిపారు.
ఇది నృత్యం, నాటకం, సంగీతం, రంగ స్థలం లాంటి ప్రదర్శన కళలపై సమగ్ర గ్రంథం, ఇది భరత ముని వార సత్వంగా కొనసాగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమం లో అనిశ్రిత రెడ్డి, జనన్య వర్మ కూచిపూడి నృత్యం చెయ్యగా శివాని రెడ్డి వయోలిన్, అక్షర, సంగీతం సాహితి, సంస్కార భారతి గీతంతో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, సంస్కార భారతి స్టేట్ సెక్రటరీ, సంస్కార భారతి మెంబర్స్ కె.హరినాథ్ రావు, జి.దేవేందర్, డా. సృజన రెడ్డి, సతీష్ రెడ్డి, కె.హిమాన్సీ పాల్గొన్నారు.