Musuru rain : భూపాలపల్లి జిల్లాలో ముసురు వర్షం

by Sridhar Babu |
Musuru rain : భూపాలపల్లి జిల్లాలో ముసురు వర్షం
X

దిశ, కాటారం : అల్పపీడన ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల్లో బుధవారం రాత్రి నుండి గురువారం రోజంతా ఓ మోస్తరు నుంచి ముసురు వర్షం పడుతూనే ఉంది. వాతావరణ శాఖ గురువారం ఉదయం నమోదు చేసిన వివరాల ప్రకారం 149.2 మీమీ వర్షపాతం నమోదైంది. గత నాలుగు రోజుల క్రితం రెండు రోజులు భారీ వర్షాలు

పడడంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు చెరువులు కుంటల్లో నీళ్లు బాగా చేరాయి. గ్రామాల్లోని బావులలో నీరు బాగా చేరి నీటి ఎద్దడి తొలగిపోయింది. ముసురు వర్షంతో గ్రామాలలో వ్యవసాయ పనులు ముఖ్యంగా వరి పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొందరు నాట్లు వేస్తుండగా మరికొందరు తమ పొలాలను సిద్ధం చేస్తున్నారు. వారం రోజులుగా వర్షం పడుతుండడంతో పత్తి పంటకు నష్టం వాటిల్లుతోంది.

గోదావరి నదికి కొనసాగుతున్న వరద ప్రవాహం

సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాణహిత నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కాలేశ్వరంలో ప్రాణహిత గోదావరి నదుల కలయికతో గోదావరి నదికి వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. కాలేశ్వరంలోని త్రివేణి సంగమ తీరంలో 94.06 మీటర్లు వరద ప్రవాహం ఉంది. అన్నారంలోని సరస్వతీ బ్యారేజ్ లో 13,500 క్యూసెక్కులు ఉంది. మేడిగడ్డ లోని లక్ష్మీ బ్యారేజీ లో 7,71,580 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.



Next Story