దుప్పి మాంసం స్వాధీనం.. అదుపులోకి న‌లుగురు వేట‌గాళ్లు

by Aamani |   ( Updated:2023-12-26 14:45:02.0  )
దుప్పి మాంసం స్వాధీనం.. అదుపులోకి న‌లుగురు వేట‌గాళ్లు
X

దిశ,ఏటూరునాగారం : నమ్మదగిన సమాచారం మేరకు వన్యప్రాణులను వేటాడిన నలుగురు వేటగాళ్లను, దుప్పి తోలు, మాంసం, ఉచ్చులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన ఘ‌ట‌న ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి..ములుగు జిల్లా తాడ్వాయి మండలం బోడి లింగాల గ్రామంలో వన్యప్రాణులను వేటాడి మాంసం విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి అట‌వీ శాఖ అధికారి సిబ్బందితో తనిఖీలు చేసి వేటగాళ్ళు సతీష్, అశోక్ లతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారిపై అట‌వీ శాఖ అదికారులు కేసు న‌మోదు చేశారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఆదినారాయణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

బోడి లింగాల గ్రామంలో చెన్నూరి సతీష్ అనే వ్యక్తి వద్ద అటవీ జంతు మాంసం ఉందనే విశ్వసనీయ సమాచారంతో అటవీశాఖ అధికారులు సతీష్ ఇంట్లో సోదాలు చేయగా అటవీ జంతువు దుప్పి మాంసం లభ్యమయిందని దీంతో సతీష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తమతో పాటు నలుగురు వ్యక్తులు ఉన్నారని లింగాల సమీపంలో అడవిలో ఉచ్చులతో దుప్పిని పడేశామని సతీష్ అటవీశాఖ అధికారులకు తెలిపారన్నారు. మరుసటి రోజు సోమవారం ఉదయం వేటాడిన అటవి ప్రాంతాంలోని సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులకు వేటగాళ్లు అమర్చిన ఉచ్చులను, చుక్కల దుప్పి తోలును అటవీ అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని నలుగురు వేటగాళ్లును అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం కేసు నమోదు చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ ఆదినారాయణ తెలిపారు.

Read More..

దిశ ఎఫెక్ట్.. ఇసుక అక్రమ రవాణాపై కొరడా చూపించిన పోలీస్ శాఖ..

Advertisement

Next Story