- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేపటితో ముగియనున్న మేడారం మినీ జాతర

దిశ, ములుగు ప్రతినిధి : రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఆసియాలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతర అనంతరం మధ్య సంవత్సరంలో నిర్వహించే మినీ జాతర బుధవారం నుండి ప్రారంభమవగా శనివారంతో ముగియనుంది. మినీ మేడారం జాతరలో భాగంగా బుధవారం కన్నెపల్లిలో మండెమెలిగే పండుగను సమ్మక్క-సారలమ్మ పూజారులు ఘనంగా నిర్వహించిన నాటి నుండి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో మేడారానికి విచ్చేస్తున్నారు. శుక్రవారం సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదం కోసం అధిక సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుని తమ ముడుపులు చెల్లించుకున్నారు.
శుక్రవారం ఉదయం నుండి భక్తుల తాకిడి మొదలవగా జంపన్న వాగులో కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించి పసుపు, కుంకుమ, చీర, సారే, ముడుపులు, ఎత్తు బంగారంతో అమ్మవార్ల గద్దెలకు చేరుకున్నారు. గత సంవత్సరం మొక్కులకు సంబంధించిన ముడుపులను అమ్మవార్లకు సమర్పించి, తమ కోరికలు నెరవేరిస్తే వచ్చే ఏడాది మహా జాతరకు మళ్లీ కుటుంబ సమేతంగా దర్శనానికి వస్తామని గద్దెల వద్ద మొక్కుకొని వెనుతిరిగి మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద సేద తీరుతూ కుటుంబ సమేతంగా వనభోజనాలు ఆచరించి ఎవరి సొంత ఇంటికి వారు తిరుగు ప్రయాణం అయ్యారు. దాంతో మేడారం రహదారులు వచ్చి పోయే వాహనాలతో రద్దీగా కనిపించాయి.