- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఉద్యమంలో మానుకోట గడ్డ పోరాట పటిమ మరువ లేనిది : ఈటల
దిశ,నర్సింహులపేట : తెలంగాణ ఉద్యమంలో మానుకోట గడ్డ పోరాట పటిమ మరువలేనిదని హుజురాబాద్ ఎమ్మెల్యే,బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు.గురువారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనగర్జన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.నరేంద్ర మోడీ వరి గింజలు కొనమని అన్ని పైసలు ఇస్తుంటే..నేనే కొంటున్న అని చెప్పుకుంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు.ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి మీటింగ్ లల్లో నన్ను ఒడిస్తే నాకేం కాదు అని మాట్లాడుతున్నారు.
కేసీఆర్ ఓడిపోతే రైతులను మంచిగా చూసుకునే బాధ్యత నాదేనని తెలిపారు.ముఖ్యమంత్రి నీ రాజ్యంలో కళ్యాణ లక్ష్మి పేరు మీద కోట్ల రూపాయలు వెచ్చించింది నిజం కావచ్చు.. కానీ తాగి ప్రాణాలు కోల్పోతున్న ఖరీదు ఎంత అని సీఎం కేసీఆర్ ని ప్రశ్నించారు.డోర్నకల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సంగీతను గెలిపించాలని కోరారు.అనంతరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య సంగీత మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గంలో కుటుంబ పాలనను అంతమొందించాలని కోరారు.కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రావు,ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్,అసెంబ్లీ కన్వీనర్ పూర్ణచందర్ రెడ్డి,మండల అధ్యక్షుడు మైదం సురేష్,బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.