అసెస్మెంట్ ల నమోదులో వేగం పెంచండి : బల్దియా కమిషనర్

by Kalyani |
అసెస్మెంట్ ల నమోదులో వేగం పెంచండి : బల్దియా కమిషనర్
X

దిశ, వరంగల్ టౌన్: భువన్ యాప్ ద్వారా అసెస్మెంట్ ల నమోదులో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఎల్ఆర్ఎస్, భువన్ యాప్, ట్రేడ్ వసూళ్ల పురోగతిపై ఉన్నతాధికారులతో కమిషనర్ సమీక్షించి వేగవంతంగా పూర్తి చేయుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పురోగతిని ఇన్చార్జి సిటీ ప్లానర్ ని అడిగి తెలుసుకున్న కమిషనర్ ఇప్పటివరకు ఎంత శాతం పూర్తి చేశారని కొనసాగుతున్న విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రేడ్ వసూళ్లకు సంబంధించి సూచించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఇందుకోసం శానిటేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వసూళ్లు జరిగేలా చూడాలని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, టి ఓ బిర్రు శ్రీనివాస్, ఈఈలు మహేందర్, సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed