అర్ధరాత్రిళ్ళు అక్రమ తవ్వకాలు..కేసులు పెట్టినా చర్యలేవి..?

by Disha Web Desk 11 |
అర్ధరాత్రిళ్ళు  అక్రమ తవ్వకాలు..కేసులు పెట్టినా చర్యలేవి..?
X

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణంలో మొరం మట్టి దందా మూడు ట్రాక్టర్లు, ఆరు టిప్పర్లుగా వర్థిల్లుతోంది. అడ్డు చెప్పే నాధుడే లేడు అనే చందంగా పరిస్థితి మారింది. పగలు ఎండ వేడవికి భయపడుతున్న అక్రమాదారులు రాత్రిళ్ళు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. రాత్రి 9 దాటితే చాలు అధికారులు భయం ఉండదనే సాకుతో విచ్చలవిడిగా అక్రమ మొరం తవ్వకాలను గుట్టుగా నర్సంపేట పట్టణంలోని పలు కాలనీల్లో కానిచేస్తున్నారు. కాలనీల్లో రాత్రి 10 గంటలు దాటితే వాహనాల రాకతో పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలు అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికే పలు మార్లు అక్రమ మట్టిదందా పట్ల స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినప్పటికీ ఒకరిద్దరిపై కేసులు ఫైల్ చేసినట్లు ఉన్నప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నది స్పష్టం అవుతోంది. నర్సంపేట సమీపంలోని చెరువులను చెరపట్టి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ప్పటికీ అధికారులు మీనమేషాలు లెక్కపెడ్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నర్సంపేటలో అధికారం మారినప్పటికీ అవినీతికి గతంలో కన్నా పెద్ద పీట వేస్తూ అధికారులు సహకరిస్తున్నారన్న వాదనలు బలంగా ఉన్నాయి. ఇ

ప్పటికే పలు మార్లు వచ్చిన ఆరోపణలపై విచారణకు సైతం రెవెన్యూ శాఖ సుముఖత చూపకపోవడం గమనార్హం. అధికార పార్టీ నాయకుల పేరుతో అక్రమంగా మట్టి రవాణా జరుగుతున్నట్లు స్థానిక కాలనీవాసులు మోర పెట్టుకున్న రెవెన్యూ అధికారులు అంటీముట్టనట్లు ఉండటం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా నర్సంపేట పట్టణంలో రాత్రిళ్ళు జరుగుతున్న మోరం అక్రమ రవాణా పట్ల అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed