- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దిశ' వార్తకు స్పందన.. అంతర్ జిల్లా మాజీ నక్సలైట్లు అరెస్టు..
దిశ, బయ్యారం: బయ్యారం లో మళ్లీ నక్సలైట్ల కలకలం.. రిటైర్డ్ ఉద్యోగిని కిడ్నాప్ చేసి రూ. 5 లక్షలు డిమాండ్ అనే వార్తా కథనం 'దిశ' వెబ్‌సైట్, 'దిశ' డైనమిక్‌లో ఈనెల 8, 9న వెలువడింది. అయితే జిల్లా పోలీసులు, స్థానిక పోలీసులు కలిసి నలుగురు మాజీ పిపిజీ నక్సలైట్లను బుధవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు మహబూబాబాద్ డీఎస్పీ రమణారావు బయ్యారం స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఈనెల 15న కొత్త గూడెం భద్రాద్రి జిల్లాకు చెందిన కొల్లి యాదగిరి రెడ్డి మావోయిస్టు హరి భూషణ్ పేరిట రూ. 20 లక్షలు చందా ఇవ్వాలని బెదిరింపులకు గురి చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిఘా పెట్టగా గురువారం ఎస్ఐ రమాదేవి, ఇల్లందు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నలుగురు వ్యక్తులు రెండు మోటార్ వెహికల్ పై వెళ్లే వారిని రోడ్డు పై వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. యాదగిరి రెడ్డి నుంచి 1,20,000 రూపాయలు వసూళ్లకు పాల్పడినట్లు, నాలుగు మొబైల్ ఫోన్స్, ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిని పట్టుకున్న సిసి పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బందికి డీఎస్పీ రమణారావు అవార్డు లు ఇచ్చి అబినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ బాలాజీ, టాస్క్ ఫోర్స్ ఎస్ ఐ రామారావు, ఇంటెలిజెన్స్ సిబ్బంది, హోమ్ గార్థు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.