Godavari River : కాళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

by Aamani |   ( Updated:2024-07-22 09:36:28.0  )
Godavari River : కాళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ,కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో పుష్కర ఘాట్లను తాకుతూ గోదావరి నది వరద ఉధృతి ప్రవాహం కొనసాగుతోంది. కాళేశ్వరం లో గోదావరి, ప్రాణహిత నదుల కలయికతో వరద ఉధృతి బాగా పెరిగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 103.65 మీటర్లకు వరద ప్రవాహం చేరింది. వరద ప్రవాహం బాగా పెరుగుతున్న దృష్ట్యా సెంట్రల్ వాటర్ కమిషన్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి పెరుగుతున్న దృష్ట్యా భక్తులు లోపలికి వెళ్లి స్నానాలు చేయకుండా సూచనలు చేస్తున్నారు. గోదావరి తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమతంగా ఉండాలని ప్రవాహం బాగా పెరిగితే పునరావాస ప్రాంతాలకు ప్రజలు తరలి వెళ్లాలని అధికారులు గ్రామాల్లో దండోరా వేయించారు.

Advertisement

Next Story

Most Viewed