వేగంగా వార్తలు..వార్తల్లో వాస్తవాలు.. దిశ ప్రత్యేకత.! : జిల్లా ఎస్పీ

by Kalyani |
వేగంగా వార్తలు..వార్తల్లో వాస్తవాలు.. దిశ ప్రత్యేకత.! : జిల్లా ఎస్పీ
X

దిశ,మహబూబాబాద్ టౌన్: "దిశ పత్రిక" వేగంగా వార్తలు అందించడంతోపాటు వార్తల్లో ఖచ్చితత్వంతో కూడిన వాస్తవాలను అందించడంలో సక్సెస్ అయ్యిందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. దిశ క్యాలెండర్ 2025 ను ఎస్పీ మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజాలను నిర్భయంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు తక్కువ సమయంలో లక్షల మంది పాఠకుల ఆదరణ పొందింది అని అన్నారు. ఎప్పటికప్పుడు డైనమిక్ ఎడిషన్ ల ద్వారా తాజా సమాచారాన్ని అందించడం లో "దిశ పత్రిక" సక్సెస్ అయిందన్నారు. ఈ సందర్భంగా మీడియా యాజమాన్యానికి, మహబూబాద్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్, మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి, క్రైమ్ డీఎస్పీ మోహన్ రావు, ఏఆర్ అడిషనల్ ఏఎస్పి విజయ ప్రతాప్, మహబూబాబాద్ జిల్లా రిపోర్టర్ లు నరేష్, రాంబాబు, ఇంద్రారెడ్డి, రేవంత్, నవనీత్, యాకయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed