బాబోయ్ మాకొద్దు సింగారం ఇసుక క్వారీ.. పనులను అడ్డుకున్న గ్రామస్తులు

by Disha Web Desk 23 |
బాబోయ్ మాకొద్దు సింగారం ఇసుక క్వారీ.. పనులను అడ్డుకున్న గ్రామస్తులు
X

దిశ,కన్నాయిగూడెం : ఏజెన్సీ ప్రాంతమైన కన్నాయిగూడెం మండలంలోని, సింగారం గ్రామంలో, రైతు పట్టా భూములులో అక్రమంగా ఇసుక మాఫియా జరుగుతుంది. ఇసుకాసురులు రాజకీయ నాయకుల అండదండలతో రైతుల పట్టా భూముల్లో ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారు. డంపింగ్ కోసం ప్రయత్నించగా రైతులు తమ భూముల్లోని ఇసుకను అక్రమంగా ఎలా తీసుకువెళ్తారు అంటూ రైతులు ఇసుక రెజ్లింగ్ కాంట్రాక్టర్లు ప్రశ్నించగా మాకు రెవెన్యూ, టిఎస్ఎండిసి పర్మిషన్లు ఉన్నాయంటూ రైతులును బెదిరింపులకు గురిచేశారు. ఇసుక రెజ్లింగ్ కాంట్రాక్టర్లకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఇసుక సురులు రైతుల అమాయకత్వం ఆసరాగా చేసుకొని కొంతమంది రైతులకు నయానో భయానో ముట్టజెప్పి రైతుల భూముల్లో నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకను దండుకోవాలని ఉద్దేశంతో రైతుల పట్టా భూముల్లోని ఇసుకను కుప్పలుగా చేసి ఎత్తుకెళ్లానే ప్రయత్నించారు. దాన్ని చూసి ఊళ్లో రైతులంతా మా భూముల్లోని ఇసుకను భారీ యంత్రాలతో తీయొద్దు అంటూ తీచినచో మా వ్యవసాయ బోర్లు, భూగర్భ జలాల్లో నీల్లుండవు అంటూ అడ్డుకోవడం జరిగింది.అనంతరం రైతులు మాట్లాడుతూ తమ పట్టా భూముల్లో ఎవరిని అడిగి ఇసుక తరలింపు కోసం ర్యాంపులు (రోడ్డు)తయారు చేస్తున్నారని, పనులు చేస్తున్న నిర్వాహకులను అడ్డుకున్నారు. దీంతో తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని సిబ్బంది తెలపడంతో చరవాణి ద్వారా రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మండల రెవెన్యూ అధికారి మహమ్మద్ సలీం తన సిబ్బందితో కలిసి ఇసుక క్వారీని సందర్శించి క్వారీ నిర్వాహకులను అనుమతి పత్రాలను అడగ్గా పొంతనలేని సమాధానం ఇవ్వడంతో అనుమతులు లేని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల కోసం ర్యాంపు(రోడ్డు) ఏర్పాటు చేస్తున్న ప్రొక్లైనర్ (హిటాచీ)ని స్వాధీనం చేసుకున్నారు.

టిఎస్ఎండిసి నుంచి అనుమతి ఉన్న పట్టా భూముల్లో మాత్రమే ఇసుక తవ్వకాలు చేయాలన్నారు. అనుమతులు లేని చోట నుంచి ఇసుక తరలించడం లేదా ఇసుక కోసం రోడ్డు వేయడం వంటివి చేసిన యెడల వాహనాలను సీజ్ చేయడంతో పాటు క్వారీ అనుమతులు రద్దు చేస్తామని క్వారీ నిర్వాహకులను హెచ్చరించారు.అనంతరం గోదావరి నదిలో ఇసుక ర్యాంపును పరిశీలించడం జరిగింది. సింగారం గ్రామంలో క్వారీ ఏర్పాటుకు సంబంధించిన అనుమతి పత్రాలను తమకు చూపించి యెడల జాయింట్ సర్వే నిర్వహించి హద్దులు చూపించిన తరువాతనే క్వారీ పనులు ప్రారంభించాలని క్వారీ నిర్వాహకులను హెచ్చరించారు. ఒకటి రెండు రోజుల్లో అనుమతి పత్రాలు చూపించని యెడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని కన్నాయిగూడెం తహసీల్దార్ యండీ.సలీం తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణేష్, డిప్యూటీ తహసీల్దార్ సర్వర్,సింగారం రైతులు నరేష్, రాజేందర్ , శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed