తీవ్ర గాయాల్లో దుగ్గొండి వాసి.. మెరుగైన వైద్యం కోసం ఎదురు చూపు

by Kalyani |
తీవ్ర గాయాల్లో దుగ్గొండి వాసి.. మెరుగైన వైద్యం కోసం ఎదురు చూపు
X

దిశ, దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లి గ్రామానికి చెందిన కందికొండ రజనీ కుమార్ తమిళనాడులోని ట్యూటికొరిన్ జిల్లాలోని ఓ కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా ల్యాబ్ లో పని చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. యాసిడ్ తో నిండి ఉన్న గాజు బాటిల్ పేలడంతో గాజు ముక్కలు పొట్టలో గుచ్చుకొని తీవ్ర రక్తస్రావమైంది. కాళ్లు, చేతులపై సైతం యాసిడ్ పడడంతో కాలి పోయాయి. అతన్ని ప్రస్తుతం ట్యుటీకోరిన్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రజనీ కుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారని రజనీ కుమార్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు చొరవ తీసుకుని అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story