ఇది ఎస్సీ, ఎస్టీలకు ఉచితం.. కానీ...

by S Gopi |   ( Updated:2022-12-25 13:25:15.0  )
ఇది ఎస్సీ, ఎస్టీలకు ఉచితం.. కానీ...
X

దిశ, కొత్తగూడ: విద్యుత్‌ చౌర్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ డివిజన్ ఇంజనీర్ విజయ్ హెచ్చరించారు. కొత్తగూడ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ కార్యాలయాన్ని మహబూబాబాద్ డివిజన్ ఇంజనీర్ విజయ్ ఆకస్మిక తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్‌ను, పలు రికార్డులను పరిశీలించారు. విద్యుత్ స్టాఫ్ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో విజయ్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం వినియోగదారులు సకాలంలో బిల్లులను చెల్లించాలని సూచించారు. రైతులు సక్రమమైన పద్ధతులలో విద్యుత్ ను వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ మోటార్లకు ఉన్న ఆటో స్టార్టర్లను తొలగించాలని, కెపాసిటర్లను అమార్చుకోవాలని కోరారు. విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లు చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులు తమ తమ కుల ధ్రువీకరణ పత్రాలను అందజేసి ప్రభుత్వం కల్పిస్తున్న 101 యూనిట్లు విద్యుత్ ను నెలకు ఉచితంగా వినియోగించుకోవచ్చని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ కవిత, ఏఈ సురేష్, అసిస్టెంట్ ఇంజనీర్ అనిల్, హైమద్, సురేష్, లక్ష్మినారాయణ విధ్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story