దిశ ఎఫెక్ట్​.. మొక్కలను తరలించిన అధికారులు

by Sridhar Babu |   ( Updated:2025-03-15 09:27:06.0  )
దిశ ఎఫెక్ట్​.. మొక్కలను తరలించిన అధికారులు
X

దిశ, ఇనుగుర్తి : అడవిని తలిపిస్తున్న నర్సరీలు.. వృక్షాలుగా మారుతున్న మొక్కలు అనే శీర్షికతో దిశ దినపత్రికలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. మొక్కలను రవాణా చేయకుండా అధికారులు నిధులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మొక్కల వేర్లు భూమిలోకి పాకి వృక్షాలుగా మారుతున్నాయని దిశలో కథనం రావడంతో అటవీ అధికారులు స్పందించి లాలుతండా సెంట్రల్ నర్సరీలో మొక్కలను షిఫ్టింగ్​ చేయించారు. కాగా అటవీ అధికారుల బాధ్యతను గుర్తు చేసిన దిశ దినపత్రికకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed