- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కమీషన్ల కోసమే AMR సంస్థకు కోల్ మైనింగ్ ప్రాజెక్టు: తీన్మార్ మల్లన్న
దిశ, మల్హర్: ప్రజా చైతన్య పాదయాత్రలో భాగంగా తీన్మార్ మల్లన్న భూపాలపల్లి జయశంకర్ జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాడిచెర్లలో ఓసీపీ కోల్ మైనింగ్ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం సింగరేణికి కాకుండా కమిషన్ల కోసం ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థకు కేటాయించిందని ఆరోపించారు. అనంతరం బొగ్గు తవ్వకాలు చేపడుతున్న ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థ ఉపరితల కోల్ మైనింగ్ గని కోసం భూములు ఇచ్చి సర్వం కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను తెలుసుకోవడానికి ఓసీపీ మైనింగ్ లోపలికి వెళ్లనివ్వకుండా కొయ్యూరు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, స్థానిక భూ నిర్వాసితులకు వాగ్వివాదం జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్, ఆధ్వర్యంలో పోలీసు బలగాలు భారీగా చేరుకొని తీన్మార్ మల్లన్న టీంను ఓసీపీ మైనింగ్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
అనంతరం మల్లన్న టీం సభ్యులు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు మల్లన్న దృష్టికి తీసుకువచ్చారు. ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కోతలు విధిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తూ.. కొనుగోలు కేంద్రాల యజమానులు ఇష్టం వచ్చినట్లు తూకం వేయడంతో రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయప ఆవేదన వ్యక్తం చేశారు. మీ రాకతోనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేయడం ప్రారంభించారని రైతులు తెలిపారు. తీన్మార్ మల్లన్న వెంట మంథని రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్యతో పాటు టీం సభ్యులు ఉన్నారు.
- Tags
- Teenmar Mallanna