'మహిళలకు అండగా సీఎం కేసీఆర్'

by Vinod kumar |
మహిళలకు అండగా సీఎం కేసీఆర్
X

దిశ, పాలకుర్తి: మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మహిళలకు గౌరవం పెరిగిందని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాలకుర్తి మండలంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొ్న్నారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ఆడబిడ్డల అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట వేస్తూ.. మహిళా సంక్షేమానికి విప్లవాత్మక పథకాలతో దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.


గత తొమ్మిది సంవత్సరాలలో 13,90,636 మంది బాలింతలు కేసీఆర్ కిట్ ద్వారా లబ్ది పొందారని, 6.84 లక్షల మంది గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, 18,46,635 మంది మహిళలకు అమ్మ ఒడి పథకం అందించి స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేనంతగా, మహిళా సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉష దయాకర్ రావు, దేవరుప్పుల కొడకండ్ల పాలకుర్తి మండలాల ప్రజా ప్రతినిధులు, మహిళలు, అంగన్వాడీ టీచర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed