- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ ఎమ్మార్వో విధులను అడ్డుకున్న వారిపై కేసులు నమోదు...
దిశ, వరంగల్ : వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సార్ నగర్ లో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థల పరిశీలనకు వెళుతున్న వరంగల్ మండల తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ ను అడ్డుకున్న వారిపై ఏనుమముల పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సార్ నగర్ లో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలం ఉందని ఆ స్థల పరిశీలనకు వరంగల్ మండల తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ వారి సిబ్బందితో వెళ్తుండగా… ఎస్సార్ నగర్ కి చెందిన కేతిరి రాజశేఖర్, కేతిరి లావణ్య అక్కడి ప్రజలను మహిళలను రెచ్చగొట్టారు. అధికారులు ఇల్లు కూల్చివేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేసి వారందరిని తీసుకొని వచ్చి ప్రభుత్వ అధికారులను అడ్డుకొని వారిపై దాడికి ప్రయత్నిస్తున్నారు. వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఏనుమముల ఇన్స్పెక్టర్ ఏ రాఘవేందర్ తెలిపారు. ఎవరైనా సరే ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.