- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డెంగ్యూతో బీటెక్ విద్యార్థి మృతి
దిశ, తొర్రూరు : డెంగ్యూ జ్వరంతో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బేతిమల్ల ప్రేమ్ కుమార్ (23) బొల్లికుంట వాగ్దేవి కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం నుండి హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల జరిగిన రాఖీ పౌర్ణమికి ఇంటికి వచ్చాడు. అప్పటికే ప్రేమ్ కుమార్ ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో తొర్రూర్ పట్టణంలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్లేట్లెట్స్ 80వేలకు పడిపోవడంతో ఆరోగ్యం బాగాలేదు అని డాక్టర్ ఎంత చెప్పినా వినకుండా మళ్లీ ఇంటికి వెళ్లి పోయాడు.
శుక్రవారం రోజున మళ్లీ జ్వరం రావడంతో పట్టణంలో ఉన్న సుదర్శన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్లేట్లెట్స్ 60 వేలకు పడిపోవడంతో ప్రేమ్ కుమార్ స్పృహ కోల్పోయారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం సురక్ష ఆసుపత్రికి రాత్రి 8 గంటలకు తరలించగా జ్వరం ఎక్కువ అవ్వడంతో తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి తండ్రి రమేష్(జూనియర్ అసిస్టెంట్ ), తల్లి లక్ష్మి కాంతా, అక్క ఉన్నారు.
- Tags
- dengue