- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనగామలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ధర్నా
దిశ, జనగామ: పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా గురువారం జనగామ, స్టేషన్ ఘన్పూర్ పట్టణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేరువేరుగా ధర్నాలు నిర్వహించాయి. జనగామ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్పూర్ లో కూడా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ, రోడ్డుపై వంట గిన్నెలు, గ్యాస్ సిలిండర్ లను పెట్టి నిరసన తెలిపారు. కేంద్ర వైఖరికి నిరసనగా కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఈ ధర్నాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి, మోడీ డాం.. డాం అంటూ నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పట్టణంలో డప్పు చ ప్పులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య, బండ పద్మ యాదగిరిరెడ్డి, వాంకుడోత్ అనిత, రేఖ, రాజు, ప్రభాకర్, ప్రణీత్ రెడ్డి, ఉదయ్, పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
జనగామ పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో కూడా గురువారం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. జోక్ ప్రకాష్ నేతన్న చేపట్టిన కార్యక్రమంలో సీపీఎం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.