- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు గ్యారెంటీలు ప్రజలకు ఒక వరం.. సీహెచ్.శివలింగయ్య
దిశ, జనగామ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజుల్లోనే ప్రకటించిన రెండు పథకాలు ప్రజలకు ఒకవరం లాంటివని జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య తెలిపారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్య శ్రీ చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు రాష్ట్రంలో పేదలందరికీ కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందనుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు, ట్రాన్స్ జెండర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సుసౌకర్యం పథకం కూడా నేటి నుండి అమలులోకి రానుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ రెండు పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రశాంత్, ఆర్టీసీ డీఎం జోత్స్న, డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.