ఎంపీకే లేదు.. సామాన్యులకు రాష్ట్రంలో రక్షణ ఉందా?

by Disha News Web Desk |
ఎంపీకే లేదు.. సామాన్యులకు రాష్ట్రంలో రక్షణ ఉందా?
X

దిశ, మహబూబాబాద్ టౌన్: నిజమాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తుండగా ఎంపీ అర్వింద్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం హేయమైన చర్య అని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఎల్ది మల్లయ్య అన్నారు. ఎంపీపై దాడికి నిరసిస్తూ.. గురువారం పట్టణంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడులు దేశంలో ఎవరూ చేయలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిపై దాడి చేయడం చూస్తే, సామాన్య ప్రజలకు ఇక రక్షణ ఎక్కడ ఉంటుందని వ్యాఖ్యనించారు. మనదేశంలో ప్రజాప్రతినిధులకు రక్షణ లేదని తెలిపారు. ఇకనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులు మాని, పాలనపై దృష్టి సారించాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా, దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సిరికొండ సంపత్, జిల్లా కార్యదర్శి రేష్మ, గార్ల మండల అధ్యక్షుడు జశ్వంత్, మానుకోట పట్టణ కార్యదర్శి పల్లె సందీప్, పట్టణ ఉపాధ్యక్షుడు మల్లం యశ్వంత్, పట్టణ కార్యదర్శి రావుల బసవయ్య, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమల్ల ప్రేమరాయుడు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story