వాజ్పేయి సేవలు మరువలేనివి.. ఎర్రబెల్లి ప్రదీప్ రావు

by Javid Pasha |   ( Updated:2022-12-25 12:55:30.0  )
వాజ్పేయి సేవలు మరువలేనివి.. ఎర్రబెల్లి ప్రదీప్ రావు
X

దిశ, ఖిలా వరంగల్: భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి సేవలు మరువలేనివని బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు కొనియాడారు. ఆదివారం వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు వాజ్పేయి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో అటల్ బిహారీ వాజ్పేయి కృషి అసాధారణమైందని స్పష్టం చేశారు. రాజనీతిజ్ఞుడిగా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా దేశ ప్రజల గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న వాజ్పేయి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed