- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీజేపీకి ప్రాణం పోసిన మహానుభావుడు అటల్ జీ

దిశ, వరంగల్ : భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వరంగల్ హంటర్ రోడ్ లోని డి కన్వెన్షన్ హాల్ లో అటల్ జీ యాదిలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ అధ్యక్షన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజ్ పేయి గురించి ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీకి ప్రాణం పోసిన మహానుభావుడు అని కొనియాడారు. అలాంటి మహానుభావుడికి నిజమైన నివాళి అర్పించడమంటే ఓరుగల్లు జిల్లా నుండి అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని కోరారు. తనకు పెద్దగా ఆశలు ఏమీ లేవని, ఎంతో మంది ముఖ్యమంత్రులను ప్రమాణ స్వీకారాలు చేయించానని, తమిళనాడు, మహారాష్ట్రలలో చక్కనైన పరిపాలన కొనసాగించే అవకాశం తనకు కల్పించింది అటల్ బిహారీ వాజ్ పేయే అన్నారు. తనకు ఉన్న ఒకే ఒక కోరిక తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూడాలని ఉంది అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అటల్ బిహారీ వాజ్పేయి తో తమ అనుభవాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, మాజీ మేయర్ టి.రాజేశ్వర రావు, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్, మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నాగపురి రాజమౌళి గౌడ్, మంద ఐలయ్య, కన్నబోయిన రాజయ్య యాదవ్, దేవేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, నిశిధర్ రెడ్డి, బలరాం, సోడా రమేష్, ప్రోగ్రాం కన్వీనర్లు పాల్గొన్నారు.