రాబోయే బతుకమ్మ దసరా ఉత్సవాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి

by Kalyani |
రాబోయే బతుకమ్మ దసరా ఉత్సవాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి
X

దిశ, పరకాల : పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ… రాబోయే సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు గ్రామాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని పరకాల నడికూడ మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవో, ఎంపీ ఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు గ్రామాల్లో ప్రస్తుతం ప్రజాప్రతినిధులు లేనందున అధికారులే పూర్తి బాధ్యత తీసుకొని అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని, ఆడుకునే స్థలంలో పారిశుద్ధ్యం, లైటింగ్ ఏర్పాట్లు వీధులన్నీ క్లీన్ చేసి సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల, నడికూడ మండల పరిషత్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed