ప్రజా వినతులను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్ కె.శశాంక

by Kalyani |
ప్రజా వినతులను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్ కె.శశాంక
X

దిశ, మహబూబాబాద్ టౌన్: ప్రజల గ్రీవెన్స్ వినతులను అధికారులు ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కారించాలని కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, ఎం. డేవిడ్ లతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చాప్లతండా 2021-22 రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికకు, 27 రాష్ట్ర స్థాయి గ్రామపంచాయతీ అవార్డులకు ఎంపికైనందుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. వేసవి కాలం దృష్ట్యా స్పెషల్ అధికారులు మండలాలలో, గ్రామాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విస్తృతంగా ప్రచారం చేయించాలన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో 97 దరఖాస్తులను పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed