- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆహార భద్రత పాటించకపోతే చర్యలు తప్పవు

దిశ, జనగామ : ఆహార భద్రత పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ హెచ్చరించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఆహార పరిరక్షణ, ప్రమాణాల శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ లతో కలిసి కలెక్టర్ ఆహార భద్రతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార భద్రతపై ఆహార తయారీ, విక్రయదారులకు ముందుగా అవగాహన కార్యక్రమం చేపట్టాలని అధికారులకు సూచించారు. ముందుగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని, షెడ్యూలు కూడా ఇవ్వాలని, సంబంధిత అధికారులకు సూచించారు.
వినియోగదారులను ఆకర్షించేందుకు ఆహారంలో హానికర రంగులు, నిషేధిత మయనిస్ వినియోగిస్తే జరిగే పరిమాణాలపై విక్రయదారులకు శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఆహార భద్రతకు సంబంధిత అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు కావాలని, విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మికంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఆహార భద్రతలో నియమనిబంధనలు పాటించని వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో వైద్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు, మహిళా శిశు సంక్షేమ అధికారిని ఫ్లోరెన్స్, వ్యవసాయ శాఖ అధికారి రామారావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆహార భద్రత శాఖ ఉమ్మడి జిల్లాల అధికారి కృష్ణమూర్తి, జిల్లా అధికారి వినీల్, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సాధిక్ అలీ తదితరులు పాల్గొన్నారు.