- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రీతి ఆత్మహత్యయత్నానికి నిరసనగా KMC ముందు ABVP నిరసన
దిశ, కరీమాబాద్: వరంగల్ మహానగర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రీతి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడే విధంగా ఇబ్బందులకు గురి చేసిన షఫీ పై వెంటనే చర్యలు తీసుకోవాలని షఫీ డిగ్రీని రద్దు చేయాలని గురువారం కాకతీయ మెడికల్ కాలేజ్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో అక్కడ చేరుకున్న పోలీసులు అన్యాయంగా ఏ.బి.వి.పి కార్యకర్తలను అడ్డుకుని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం అయిత నిఖిల్ మాట్లాడుతూ.. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడింది. కేఎంసీలో విధుల్లో ఉన్న డాక్టర్ ప్రీతి సీనియర్ పీజీ వైద్యుని చే చాలా రోజుల నుంచి వేధింపులు తాళలేక అనస్థీషియా ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిందని.. ప్రీతి కి ఈ గతి పట్టించిన నిందితుడైన షఫీ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు. కాగా KMC ముందు నిరసన తెలిపిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు.