Viral: కూతురి తలపై సీసీ కెమెరా అమర్చిన తండ్రి.. ఆ భయమే కారణం!

by Ramesh Goud |   ( Updated:2024-09-09 13:03:33.0  )
Viral: కూతురి తలపై సీసీ కెమెరా అమర్చిన తండ్రి.. ఆ భయమే కారణం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ బాలిక తలపై సీసీ కెమెరా ధరించి తిరుగుతున్న ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. ఆ కెమెరాను తన తండ్రే స్వయంగా అమర్చాడని బాలిక చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో లో బాలిక మాట్లాడుతూ.. తన తలపై సీసీ కెమెరాను తన తండ్రే స్వయంగా అమర్చాడని తెలిపింది. దానికి కారణం ఇటీవల కారాచీలో ఓ హిట్ అండ్ రన్ కేసు సంచలనం సృష్టించింది. అలాగే తనను కూడా ఎవరైనా యాక్సిడెంట్లో చంపితే కనీసం సాక్ష్యం అయినా ఉంటుందని తన తండ్రి ఇలా చేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఆ హిట్ అండ్ రన్ కేసులో నిందితురాలు ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఆమెకు త్వరగా బెయిల్ రావడంపై నిరసనగా ఇలా చేసినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. నిరసన తెలపడం బాగానే ఉంది కానీ పాపం ఆ బాలిక కెమెరాను ఎన్నాళ్లు మోస్తుంది అని బాధను వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story