Vishnupriya: బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల స్పీడ్.. పంజాగుట్ట పీఎస్ లో విచారణకు విష్ణుప్రియ

by Prasad Jukanti |   ( Updated:2025-03-20 14:32:15.0  )
Vishnupriya: బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల స్పీడ్.. పంజాగుట్ట పీఎస్ లో విచారణకు విష్ణుప్రియ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో (Betting Apps Promotion Case) దర్యాప్తు కొనసాగుతున్నది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 11 మంది సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు (Panjagutta PS) ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించారు. పోలీసుల నోటిసుల నేపథ్యంలో ఇవాళ నటి విష్ణుప్రియ (Vishnupriya) పంజాగుట్ట పీఎస్ కు విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్ తో కలిసి విష్ణుప్రియ పీఎస్ కు వచ్చారు. విచారణ సందర్భంగా పోలీసులు ఏయే అంశాలపై ఆరా తీయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారంలో మిగతా వారికి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకావాడనికి కొంతమంది యూట్యూబర్లు మరికొంత సమయం కోరినట్లు తెలుస్తోంది. పోలీసుల చర్యలతో ఇకపై బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేయబోమని కొందరు యూట్యూబర్లు సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. వీరి వెనుక ఉన్నది ఎవరు? ఎంత మేర డబ్బులు చేతులు మారాయి అనే అంశాలపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Read More..

‘అదిదా సర్‌ప్రైజ్’సాంగ్ రీక్రియేట్ చేసిన అమ్మాయిలు.. మీకేం పోయేకాలం వచ్చిందంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

సినీనటులే కాదు.. ఎవరినీ వదిలిపెట్టం.. వెస్ట్‌జోన్ డీసీపీ హెచ్చరిక

Next Story

Most Viewed