- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చొప్పదండిలో.. రోజురోజుకు పెరుగుతున్న వైరల్ జ్వరాలు!
దిశ, వెబ్ డెస్క్: కరీంనగర్ జిల్లాలో చొప్పదండి పట్టణంలోని 12, 13 వార్డు పరిధిలో.. గత వారం రోజులుగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ జ్వరాలు సోకిన ప్రజలు చికున్ గున్యా మాదిరిగా ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. అక్కడ వార్డులోని చాలా ప్రాంతాలలో చెత్త ఎక్కువగా నిల్వఉండటం వల్ల, మురికి కాలువలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. దీని వల్ల అక్కడ నివసించే వార్డులోని కుటుంబాలు విష జ్వరాలతో బాధ పడుతున్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు చొప్పున ఈ వైరల్ ఫీవర్ల తో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఈ జ్వరాల గురించి మున్సిపల్ కమిషనర్ కు స్థానికులు కంప్లైంట్ చేశారు. దీంతో స్పందించిన మున్సిపల్ శాఖ ఆరోగ్య సిబ్బందిని సంబంధిత వార్డులలోకి పంపి, వైరల్ ఫీవర్లతో బాధపడుతున్న ఇళ్లకు వెళ్లి మలేరియా పరీక్షలు జరిపి, జ్వరం ట్యాబ్లెట్లను మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని అక్కడి కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.