భట్టి విక్రమార్కకు కృతజ్ఞత లేదు.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
భట్టి విక్రమార్కకు కృతజ్ఞత లేదు.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంబర్‌పేట్‌లోని ఆయన నివాసంలో మౌన దీక్షకు దిగనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని దీక్షకు దిగబోతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత భట్టి విక్రమార్కకు లేదని సీరియస్ అయ్యారు. ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్త చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మాట్లాడినందుకు తనపై కక్ష గట్టారని ఆవేదన చెందారు. ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్నానని తెలిపారు. తనకు టికెట్ రాకుండా కుట్రలు చేయడమే కాదు.. ఖమ్మం టికెట్‌ను బయటవారిని ఇవ్వడానికి సిద్ధమయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. భట్టిని సొంత తమ్ముడిగా భావించినట్లు తెలిపారు. కానీ, ఇలా నా విషయంలో కుట్ర చేస్తాడని అనుకోలేదని ఆవేదన చెందారు.

Next Story

Most Viewed