‘ఉచితాలకు నేను వ్యతిరేకం’.. ఫ్రీ స్కీమ్స్‌పై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
‘ఉచితాలకు నేను వ్యతిరేకం’.. ఫ్రీ స్కీమ్స్‌పై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉచిత పథకాలపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉచితాలకు తాను వ్యతిరేకమని ప్రకటించారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి తప్పులేదు.. కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఉచిత హమీలు అమలు చేయడం కోసం మళ్లీ అప్పులు చేయడం సరికాదని హితవు పలికారు.

ప్రజలకు ఏం చేస్తారో అవే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని సూచించారు. ఉచితాలపై ప్రజలు కూడా రాజకీయ పార్టీలను ప్రశ్నించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పార్టీ ఫిరాయింపులపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్లడం ఇటీవల రాజకీయ నాయకులకు ట్రెండ్‌గా మారిందని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మారాలనుకునే నేతలు వాళ్ల పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరవచ్చన్నారు. పదవికి రాజీనామాకు చేయకుండా పార్టీ ఫిరాయించి నేతలపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసభ్యంగా మాట్లాడేవారిని, అవినీతిపరులను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed