- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Hyderabad : హైకోర్టును ఆశ్రయించిన రంగరాజన్ పై దాడి నిందితుడు వీరరాఘవరెడ్డి

దిశ, వెబ్ డెస్క్ : చిల్కూరు బాలాజీ ఆలయ(Chilukuru Balaji Temple) పూజారి కేసులో నిందితుడైన కె.వీర రాఘవ రెడ్డి(Veera Raghava Reddy) హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. సైబారాబాద్ కమిషనరెట్ పరిధిలోని మొయినాబాద్ పిఎస్ లో తనపై నమోదైన కేసులో సెక్షన్లు నేరం కాదని , 24 గంటలకు మించి అరెస్టు, రిమాండ్ చట్ట విరుద్దమని రాఘవ రెడ్డి తరపున న్యాయవాది సుంకర నరేస్ కోర్టుకు గురువారం వివరించారు. పిటిషనర్ వాదనలు పరిశీలించిన హైకోర్టు విచారణను శుక్రవారం చెపడతామని తెలిపింది. చిలుకురు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్(Rangarajan) పై దాడి జరిగిన విషయం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం అయింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సైతం పూజారి రంగరాజన్ తో స్వయంగా ఫోన్ లో మాట్లాడి న్యాయం చేస్తామని హమి ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో సహ 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.