ప్రాణాలు ఎలా పోతాయో లైవ్ వీడియోను షేర్ చేసిన వీసీ సజ్జనార్

by Nagaya |   ( Updated:2023-09-12 12:44:55.0  )
ప్రాణాలు ఎలా పోతాయో లైవ్ వీడియోను షేర్ చేసిన వీసీ సజ్జనార్
X

దిశ, వెబ్‌డెస్క్ : రహదారులు అద్దంలా ఉన్నాయని వాహనచోదకులు జెట్ స్పీడ్‌‌లో దూసుకుపోతున్నారు. వాహనం ఏదైనా దూకుడిగా డ్రైవింగ్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా వచ్చే ఏ వెహికిల్ అయినా వందల నుంచి వేలల్లో సీసీ ఇంజన్లు కలిగి ఉంటున్నాయి. దీంతో రోడ్లెక్కిన బండ్లు రాకెట్ వేగాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎన్నో ఘోర ప్రమాదాలు జరిగి ఏడాదికి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అతివేగం, అజాగ్రత్త కారణంగా జరిగిన ఓ రోడ్డు ప్రమాద వీడియోని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

సెప్టెంబర్ 2న జరిగిన ఈ ప్రమాదంలో ఎవరు ప్రాణాలు కోల్పోయారు.. ఎవరు బతికి బయటపడ్డారో తెలియదు కానీ.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాన్ని బట్టి.. రోడ్డుపై వెళ్తున్న కారు ఓ మూల మలుపు దగ్గరకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఓ బైకర్ కారును ఢీకొట్టాడు. మూల మలుపు కావడంతో బైక్‌ను కంట్రోల్ చేయలేని బైకర్ నేరుగా కారు మీదికి రానిచ్చాడు. బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి అమాంతం గాలిలో ఎగిరి కారుపై పడిపోయారు. ఈ సందర్భంగా వీసీ సజ్జనార్ ఆ వీడియోని ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story