- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Valentine's Day Special: కాంగ్రెస్ MLA లవ్ స్టోరీ గురించి తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ.. రెండు మనసుల కలయిక, తియ్యని అనుభూతి, మాటల్లో చెప్పలేని భావన అంటారు. తమ ప్రేమ ముందు సముద్రం లోతు కూడా చిన్నబోతుంది. ఆకాశం కూడా తమ ప్రేమకంటే తక్కువవుతుంది. ప్రేమను దక్కించుకోవడం కోసం, ప్రేమించిన వారి కోసం ఏమైనా చేస్తారు, ఎవరినైనా ఎదిరిస్తారు ప్రేమికులు. ఇక ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని (Valentine's Day) ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రేమను వ్యక్తపరచుకునే ఈ ప్రత్యేక రోజును జంటలు తమ జీవితంలో గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. వాలంటైన్స్ డే సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం ప్రేమకథ గురించి తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం-పుష్ప దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విప్లవ, ప్రగతిశీల ఉద్యమంలో పనిచేసే సమయంలో ఇద్దరి జీవిత లక్ష్యం ఒక్కడే కవాటంతో కలిసి బతకాలనుకున్నారు. ఇరు కుటుంబాలు కమ్యునిస్టు భావజాలం కలిగి ఉండటంతో పెద్దల అంగీకారంతో ఆనాడు వీరేశం-పుష్పలు పనిచేస్తున్న ఉద్యమ సంస్థే వీరి పెళ్లి జరిపించింది. వీరికి ఒక కుమారుడు విపుల్ కుమార్, ఒక కుమార్తె వినుత్న ఉన్నారు.
ఇక, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద-సరోజ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్-రమ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి-నీలిమ.. ఇలా ఎందరో మన పాలకులు ఒకప్పుడు ప్రేమలో పడ్డవారే.