వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ఉస్మా‘‘నయా హాస్పిటల్’’.. మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2025-01-29 17:06:15.0  )
వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ఉస్మా‘‘నయా హాస్పిటల్’’.. మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో(Latest Technology) కొత్త ఉస్మానియా హాస్పిటల్‌(Osmania Hospital)ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Health Minister Damodar Rajanarsimha) తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సెక్రటేరియట్‌(Secretariet)లో మంత్రి దామోదర సమీక్ష సమావేశం(Review Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా(health Secretary Cristina) సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉస్మానియా హాస్పిటల్‌కు పునర్వైభవాన్ని తీసుకొస్తామని, 26.30 ఎకరాల విస్తీర్ణంలో, 32 లక్షల స్క్వేర్ ఫీట్ సామర్థ్యంతో విశాలమైన హాస్పిటల్ భవనాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.

ఈ హాస్పిటల్‌ మొత్తం 2 వేల పడకలు అందుబాటులో ఉంటాయని, ప్రస్తుతం ఉన్న ఉస్మానియా హాస్పిటల్‌లో 22 డిపార్ట్‌మెంట్లు ఉండగా, అదనంగా మరో 8 డిపార్ట్‌మెంట్లు కొత్త ఉస్మానియాలో ప్రారంభిస్తామని చెప్పారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, కోట్ల మంది ప్రజలు కొత్త ఉస్మానియా కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారని, వారందరి కలను నెరవేర్చుకునే సమయం వచ్చిందన్నారు. హాస్పిటల్ నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని సూచించారు. తమకు ఉన్న 38 ఎకరాల స్థలంలో, 26.30 ఎకరాలను హాస్పిటల్ కోసం ఇచ్చిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు, గోషామహల్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మిగిలిన స్థలంలో పోలీసులు తమ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చునని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హాస్పిటల్‌కు వేదిక అవుతున్న గోషామహల్ ప్రజలు ఎంతో అదృష్టవంతులని, ఈ ప్రాంతం పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అన్నిరకాల వైద్య సేవలు వాకిట్లోనే అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇక హాస్పిటల్‌లో ప్రతి గదిలోకి గాలి, వెలుతురు వచ్చేలా హాస్పిటల్ భవనాలను డిజైన్ చేయించామని, హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లకు, స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా హాస్పిటల్‌కు కేటాయించిన స్థలంలోనే నలువైపులా విశాలమైన రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక టెక్నాలజీ, వసతులతో కూడిన మార్చురీని నిర్మించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పేషెంట్ల సౌకర్యార్థం అన్ని రకాల డయాగ్నసిస్ సేవలను ఒకే చోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌‌లో ఓపీ సేవలు అందించాలని సూచించారు. పేషెంట్ల కోసం విశాలమైన వెయిటింగ్ హాల్స్ ఉండాలని, కనీసం రోజూ 3 వేల నుంచి 5 వేల మంది పేషెంట్లు వచ్చే అవకాశం ఉన్నందున, ఇందుకు అనుగుణంగా ఓపీ కౌంటర్లు ఉండాలని, ఓపీ కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడే ప్రసక్తే ఉండకూడదని స్పష్టం చేశారు. ఇక కొత్త ఉస్మానియాలో నర్సింగ్, డెంటల్, ఫిజియో థెరపీ కాలేజీలు అందుబాటులోకి తీసుకొస్తామని, స్టూడెంట్ల కోసం హాస్పిటల్ ఆవరణలోనే హాస్టల్స్‌ను నిర్మిస్తున్నామని మంత్రి దామోదర్ వెల్లడించారు.

Next Story

Most Viewed