- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిన్ను చం*పడం పక్కా.. స్టార్ హీరోను బెదిరిస్తూ వాట్సప్ మెసేజ్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సోమవారం ముంబై వర్లీ ప్రాంతంలోని రవాణాశాఖ కార్యాలయానికి అధికారిక నంబర్‌కు వాట్సాప్ ద్వారా బెదిరింపు మెసేజ్ వచ్చింది. సల్మాన్ ఇంట్లోకి చొరబడి చంపేస్తామని, అతడి కారును పేల్చివేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి సందేశం పంపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ మెసేజ్ లో ఇంకా ఏముందో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి.
ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను మోసం చేశారని, అందులో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. కొంతమంది అంబేడ్కర్ ఓ వర్గానికి చెందిన నాయకుడిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ఈసందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
వైసీపీ హయాంలో అప్పటి పాలకమండలి గోశాలను నిర్లక్ష్యం చేసిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో ఇవాళ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో గోశాలలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిందని, నిర్లక్ష్యమే కారణమని విజిలెన్స్ రిపోర్టు కూడా ఇచ్చిందన్నారు. 2023లో గోశాలపై విజిలెన్స్ నివేదికను ఆయన బయటపెట్టారు. ఆ నివేదికలో ఏం ఉందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలే ఇందుకు ఉదాహరణలన్నారు. రాబోయే నెల రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతాయని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగాలను సాధించుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.