- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్ఎల్బీసీ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేంద్రమంత్రి

దిశ, వెబ్ డెస్క్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన (SLBC Tunnel Incident)పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు (Telangana BJP President), కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ (Twitter) వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) ఆమ్రాబాద్ మండలం (Amrabd Mandalam)లో శ్రీశైలం ఎడమ కాలువ (Srishailam Left Canal) సొరంగం (Tunnel) కొన్ని మీటర్ల మేర కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడే పనికి వెళ్లిన కొందరు కార్మికులు (Workers) సొరంగంలో చిక్కుకుపోయారు. వారికి బయటికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం (Government) అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
దీనికోసం రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) నిర్వహించి, టన్నెల్ లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కేంద్ర బలగాలతో (Central Teames) పాటు రాష్ట్ర సిబ్బంది కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో SLBC పైకప్పు కూలిపోయిన విషాద సంఘటన తెలిసి దిగ్భ్రాంతి (Shocking) చెందానని తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల క్షేమం కోసం, భద్రత కోసం దేవుడిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా సహాయ చర్యలలో భాగంగా భారత ప్రభుత్వం (Indian Governemt) రాష్ట్ర అధికారులతో కలిసి పనిచేస్తూ, నిశితంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాలను అందిస్తోందని తెలియజేశారు. హోం మంత్రిత్వ శాఖ (Home Ministry) ఈ సహాయ చర్యల కోసం NDRF బృందాలను పంపిందని, దీంతో పాటుగా ఇండియన్ ఆర్మీ (Indian Army) కూడా సహాయ చర్యలు పాల్గొంటోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కూడా ఈ ఘటన పట్ల విచారణ వ్యక్తం చేస్తూ సహాయ చర్యల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM)తో మాట్లాడారని బీజేపీ నేత (BJP Leader) వివరించారు.