136 శాతం పెరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు.. మొత్తం ఆస్తుల విలువెంతంటే?

by Ramesh Goud |   ( Updated:2024-04-20 14:35:27.0  )
136 శాతం పెరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు.. మొత్తం ఆస్తుల విలువెంతంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపధ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్ధులు తమ నామినేషన్లను సమర్పిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్ధి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ తో పాటు సమర్పించిన అఫిడవిట్ లో ఆయన ఆస్తుల వివరాలు తెలిపారు. ఇందులో గత ఎన్నికలతో పోలిస్తే కిషన్ రెడ్డి కుటుంబం యొక్క ఆస్తులు దాదాపు 136 శాతం పెరిగినట్లు స్పష్టం చేశారు. అఫిడవిట్ ప్రకారం 2019 లో 8.1 కోట్లుగా ఉన్న తన ఆస్తి ఈ ఐదేళ్లలో 19.2 కోట్లుకు చేరింది.

ఇందులో చరాస్తులు 8.3 కోట్లు ఉండగా.. స్థిరాస్తులు 10.8 కోట్లు ఉన్నాయని, మొత్తంగా 2022-23 సంవత్సరంలో తన ఆదాయం 13.5 లక్షలుగా ప్రకటించారు. అలాగే డిజైన్ టూల్స్ లో డిప్లొమా చేసిన అతనిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. కేంద్ర మంత్రిగా ఉన్న తన పేరుపై 1995 సంవత్సరానికి చెందిన మారుతీ 800 కారు మాత్రమే ఉండటం గమనార్హం. ఇక తన పుట్టిన ఊరు అయిన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ వద్ద 8 ఎకరాల భూమి ఉందని ఎన్నికల అఫిడవిట్ లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read More...

అప్పుడు బీఆర్ఎస్‌లోకి.. ఇప్పుడు కాంగ్రెస్‌లోకి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story