- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఈ నియోజకవర్గ ఎంపీని.. పోలీసులపై కిషన్ రెడ్డి సీరియస్
దిశ, బేగంపేట/బోయిన్‌పల్లి: సికింద్రాబాద్ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన ప్రధాని స్పందించి, బాధితులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ప్రమాద స్థలిని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఏ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు చనిపోయారో, ఆ రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని, కరెంట్ బిల్లుల కోసం కాదు.. సమస్యలు ఉన్నచోట వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. ప్రమాదానికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ బైక్సే అయితే, వారి మేనేజ్మెంట్ కూడా బాధ్యత వహించాలని, వారిపై కూడా కేసులు నమోదు చేయాలని అన్నారు. అంతకుముందు పోలీసులపై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తాను వచ్చే సమయానికి పోలీసులు లాడ్డికి తాళం వేసి ఉంచడాన్ని చూసి కేంద్రమంత్రి ఆగ్రహానికి గురయ్యారు. తాను ఈ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిని అని కోపగించుకున్నారు. అనంతరం ఘటనా స్థలిని పరిశీలించారు. సమగ్ర విచారణ చేయించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.
Also Read : సికింద్రాబాద్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన