నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త.. 5 లక్షల ఉద్యోగాలపై కీలక ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-21 13:51:07.0  )
నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త.. 5 లక్షల ఉద్యోగాలపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగ యువత(Unemployed Youth)కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) భారీ శుభవార్త చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. బొగ్గు రంగంలో 5 లక్షల ఉద్యోగాల(5 Lakh Jobs) కల్పనకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి రెండు బిలియన్ టన్నుల బొగ్గు అవసరమని అభిప్రాయపడ్డారు. 2014తో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి 76 శాతం పెరిగిందని అన్నారు. 2040 నాటికి గరిష్ట స్థాయికి బొగ్గు డిమాండ్ ఉంటుందని తెలిపారు. నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని తెలుగు రాష్ట్రాలకు కిషన్ రెడ్డి సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. సోమవారం ఒడిశాలోని కోణార్క్‌లో జరిగిన రాష్ట్రాల బొగ్గు, గనులశాఖ మంత్రుల మూడో జాతీయ సదస్సులోనూ కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారానే 72% విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటం, పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతుండటంతో విద్యుదుత్పత్తి కూడా పెరుగుతోందన్నారు.




Next Story