అట్టహాసంగా ప్రారంభమైన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్‌

by Satheesh |
అట్టహాసంగా ప్రారంభమైన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: వార‌స‌త్వ క‌ట్టడాల ప‌రిర‌క్షణ ధ్యేయంగా యునెస్కో ప్రపంచ వార‌స‌త్వ క‌మిటీ 46వ సెష‌న్ ఆదివారం ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైంది. ఈ సెషన్‌లో రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హాజ‌ర‌య్యారు. తెలంగాణకు సంబంధించిన ప్రసిద్ధ వార‌స‌త్వ క‌ట్టడాలు, చారిత్రక ప్రాంతాలు, ప‌ర్యాట‌క ప్రదేశాల‌కు చెందిన క‌ళాఖండాలు, వాటి స‌మాచారాన్ని తెలిపేలా స్టాల్‌ను ఏర్పాటు చేశారు. సాగ‌ర్‌లోని బుద్ధవనాన్ని అంత‌ర్జాతీయలో అభివృద్ధి చేయ‌డంతో పాటు రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక, వారసత్వ ప్రాంతాల ప‌రిర‌క్షణ‌, అభివృద్ధికి ఇలాంటి స‌మావేశాలు దోహ‌ద‌ప‌డుతాయ‌న్నారు. ఈ స‌మావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేంద‌ర్ రెడ్డి, ప‌ర్యాట‌క శాఖ‌ డైరెక్టర్ ఇలా త్రిపాఠి, పురావ‌స్తు శాఖ డెరెక్టర్ భార‌తీ హోలికేరి హాజ‌ర‌య్యారు.


Advertisement

Next Story

Most Viewed