సీఎంఆర్ఎఫ్ ఫ్రాడ్‌లో ఇద్దరి అరెస్టు

by M.Rajitha |
సీఎంఆర్ఎఫ్ ఫ్రాడ్‌లో ఇద్దరి అరెస్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో : నకిలీ బిల్లులు, ఫోర్జరీ సంతకాలతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల క్లియరెన్సుతో మోసానికి పాల్పడిన ఇద్దరిని సీఐడీ పోలీసులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, అందులో నకిలీ బిల్లుల సాఫ్ట్ కాపీలు, రెండు ఆస్పత్రుల పేరుతో ఉన్న రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో అప్లికేషన్‌కు రూ.4 వేల చొప్పున చార్జి చేసిన వీరిద్దరూ 19 అప్లికేషన్లను తయారుచేశారని, ఆస్పత్రుల పేరుతో రబ్బర్ స్టాంపులను వాడి, నకిలీ బిల్లులను వాడి సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ వాడుకునే ప్రయత్నం చేశారని సీఐడీ విభాగం డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు. మిర్యాలగూడలోని డాక్టర్స్ కాలనీలో ఉన్నట్లు సమాచారం అందుకున్న స్థానిక సీఐడీ టీమ్... జి.గిరి, ఎల్ సైదిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం వీరిని నల్లగొండ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచామని, కోర్టు వారికి రిమాండ్ విధించినట్లు తెలిపారు.


నల్లగొండలోని అమ్మ హాస్పిటల్, మిర్యాలగూడలోని నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున వీరు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా డబ్బులు పొందేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇందులో గిరి అనే వ్యక్తి మిర్యాలగూడలోని చాణక్య హాస్పిటల్‌తో ఆర్ఎంపీ డాక్టర్‌గా పరిచయంలో ఉన్నారని, అదే జిల్లాలోని నిడమనూరు మండలం రేగులగడ్డ గ్రామానికి చెందినవారని తెలిపారు. మరో వ్యక్తి లేకిరెడ్డి సైదిరెడ్డి మిర్యాలగూడలోని నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. వారిద్దరి నుంచి ఆ రెండు ఆస్పత్రుల లెటర్‌హెడ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed