- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చోరీకి గురైన బస్సు సిరిసిల్లలో ప్రత్యక్ష్యం

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల ఆర్టీసీ బస్సు చోరీ ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సిద్దిపేటలో చోరీకి గురైన ఆర్టీసీ అద్దె బస్సు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారు ప్రాంతంలో ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట డిపోకు చెందిన అద్దె బస్సు (టీఎస్ 36 టీఏ 3336)ను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా సిద్దిపేట బస్టాండ్‌కు వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకొని వేములవాడకు వచ్చాడు.
అక్కడి నుంచి హైదరాబాద్ బోర్డుతో మళ్ళీ ప్రయాణికులను ఎక్కించుకుని బయల్దేరాడు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసి, టికెట్ మాత్రం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు డ్రైవర్‌ను నిలదీశారు. దీంతో తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద దొంగ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ వ్యవహారం పోలీసులకు తెలుపగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.