TSPSC సంచలన నిర్ణయం.. ఇకపై ఆ విధానంలో పరీక్షలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-23 03:08:45.0  )
TSPSC సంచలన నిర్ణయం.. ఇకపై ఆ విధానంలో పరీక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. లక్షల మంది భవిష్యత్తుతో ముడి పడి ఉన్న ఈ వ్యవహారంలో టీఎస్సీపీఎస్సీ ఆచితూచి వ్యవహరిస్తోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని బోర్డు భావిస్తోంది. ఆన్ లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 25వేల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు మాత్రమే కంప్యూటర్ల ఆధారిత పరీక్ష నిర్వహిస్తుండగా.. అంతకుమించి అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు కూడా ఈ విధానాన్ని విస్తరించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది.

అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నా విడతల వారీగా ఆన్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని చూస్తోంది. తొలుత ప్రొఫెషనల్ పోస్టులు ఉద్యోగాలతో ఈ ప్రక్రియ ప్రారంభించి భవిష్యత్తులో అన్ని ఉద్యోగాలకు అమలు చేయాలని నిర్ణయించింది. పరీక్షలను సీబీఆర్ టీ లేదా ఓ ఎంఆర్ విధానంలో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ఉద్యోగ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇతర రాష్ట్రాల పీఎస్సీలో ఈ విధానం ఇప్పటికే అమలవుతున్నందున ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించింది. టీఎస్పీఎస్సీ నిర్వహించే వెటర్నరీ అసిస్టెంట్, డ్రగ్ ఇన్సెపెక్టర్, ఏఎంవీఐ, పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఏఈ, ఏఈఈ తదితర పరీక్షలకు ఆన్ లైన్ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.

Next Story

Most Viewed